Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. కేంద్రం స్పష్టత..
Amaravati: ఏపీ రాజధాని అమరావతేనని మరోమారు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.;
Amaravati: ఏపీ రాజధాని అమరావతేనని మరోమారు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్థారిస్తూ.. 2022-23 బడ్జెట్‌లో కొన్ని కేటాయింపులు కూడా చేసింది. విభజన చట్టం ప్రకారం రాజధానికి నిధులు ఇస్తున్నట్టు పేర్కొంది. ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే ప్రస్తుత బడ్జెట్‌లో ప్రొవిజన్ పెట్టారు.
పట్టణాభివృద్ధి శాఖ నుంచి సచివాలయంతో పాటు.. ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలకు నిధుల కేటాయింపు చేశారు. సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు.
- ఏపీ రాజధాని అమరావతే
- అమరావతికి నిధులు కేటాయించిన కేంద్రం
- ఏపీ రాజధానిగా అమరావతిని నిర్థారిస్తూ..
- 2022-23 బడ్జెట్‌లో కేటాయింపులు చేసిన కేంద్రం
- విభజన చట్టం ప్రకారం రాజధానికి నిధుల కేటాయింపు
- ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే..
- బడ్జెట్‌లో ప్రొవిజన్ పెట్టిన కేంద్రం
- పట్టణాభివృద్ధి శాఖ నుంచి సచివాలయంతో పాటు..
- ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలకు నిధులు
- సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్లు అంచనా వ్యయం