Chandra babu: అమరావతిని జగన్ ప్రభుత్వం నాశనం చేసింది- చంద్రబాబు
Chandra babu: బాబాయ్‌ను చంపి మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తారా అని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.;
Chandra babu: అవాస్తవాలు, తప్పుడు ప్రచారాలతో జగన్ అధికారంలోకి వచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఐ-టీడీపీ టీమ్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. సోషల్ మీడియాలో పార్టీ ప్రచారం, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో ఐ-టీడీపీ టీమ్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ఐ-టీడీపీ టీమ్ సభ్యులు భారీగా తరలివచ్చారు.
దేశంలోనే గొప్ప సిటీగా రూపొందించాలనుకున్న అమరావతిని జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. కులం, మతం, ప్రాంతం పేరుతో పబ్బం గడుపుతున్నారని, అభివృద్ధి అనే మాటనే వదిలేశారన్నారు. అమరావతి అభివృద్ధి చెందివుంటే ఈపాటికే చాలా ఉద్యోగాలు లభించేవన్నారు.
బాబాయ్‌ను చంపి మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తారా అని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. వివేకాను గొడ్డలిపోటుతో చంపి, గుండెపోటు అని చెప్పారని ఫైరయ్యారు. 40 కోట్ల సుఫారి ఎవరి రక్త చరిత్ర అని ప్రశ్నించారు. సిగ్గులేకుండా సీబీఐపై దాడి చేస్తున్నారన్నారు.