Chandra Babu : విద్యా నిధి స్కీమ్‌లో అంబేడ్కర్ పేరును తీసేయడమేంటి : చంద్రబాబు

Chandra Babu : విద్యానిధి స్కీమ్‌లో అంబేడ్కర్‌ పేరును తొలగించి జగన్ పేరు చేర్చటంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.;

Update: 2022-07-16 09:02 GMT

Chandra Babu : విద్యానిధి స్కీమ్‌లో అంబేడ్కర్‌ పేరును తొలగించి జగన్ పేరు చేర్చటంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌రెడ్డి అహంకారానికి నిదర్శమని విమర్శించారు. టీడీపీ హయాంలో అంబేడ్కర్ ఓవర్సీస్‌ విద్యానిధి స్కీమ్‌ పేరుతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సాయం అందించినట్లు తెలిపిన చంద్రబాబు.. 15దేశాల్లో పీజీ, ఎంబీబీఎస్ ఉన్నత చదువులకు 15 లక్షల ఆర్థిక సాయం చేసినట్లు వెల్లడించారు.

మూడేళ్లుగా విద్యానిధి పథకాన్ని పట్టించుకోని వైసీపీ సర్కార్‌...ఏకంగా స్కీమ్‌ నుంచి అంబేడ్కర్‌ పేరు తీసేయటం అంటే మహానీయుడిని అవమానించటమేన్నారు చంద్రబాబు

Tags:    

Similar News