దళిత ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సచివాలయంలో సమావేశం అయ్యారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తీసుకోవాల్సిన అంశాలపై కూటమి పార్టీల దళిత ఎమ్మెల్యేలతో చర్చించారు. వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉప కులాలందరికీ దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించాలన్నారు సీఎం చంద్రబాబు. జనాభా దామాషా పద్దతిలో జిల్లా ఒక యూనిట్‌గా వర్గీకరణ అమలు చేస్తామన్నారు. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వర్గీకరణ అమలు చేశామని...తరువాత న్యాయ సమస్యల కారణంగా ఆ కార్యక్రమం నిలిచిపోయిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.