ఎన్నికను అడ్డుకునే బదులు అధికార పార్టీ వారినే ఛైర్మన్‌‌‌గా నియమించుకోండి : చంద్రబాబు

Chandrababu Naidu : కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.;

Update: 2021-11-23 09:15 GMT

Chandrababu (tv5news.in)

Chandrababu Naidu : కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. విధ్వంసం సృష్టించి ఎన్నిక వాయిదా వేయడం.... ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే అని మండిపడ్డారు. పనిచేయటం చేతగాకపోతే SEC, DGP పదవుల నుంచి తప్పుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. కొండపల్లిలో సంబంధం లేని వ్యక్తులు మారణాయుధాలతో హల్ చల్ చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. భయభ్రాంతులకు గురిచేసి టీడీపీ సభ్యుల్ని లోబరుచుకోవాలని చూస్తున్నారన్నారు. ఇంత విధ్వంసం జరుగుతుంటే పోలీసులు గుడ్లప్పగించి చూస్తున్నారని మండిపడ్డారు. మా సహనాన్ని చేతగానితనంగా పరిగణించొద్దన్నారు చంద్రబాబు. 

Tags:    

Similar News