కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలపై చంద్రబాబు ఆగ్రహం..!
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.;
Nara chandrababu Naidu (File Photo)
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గుడుపల్లి మండలం సోదిగానిపల్లెలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వైసీపీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాల వైసీపీ నేతలు వస్తున్నారని... రామకుప్పం మండలం పెద్దూరులో గొడవలు సృష్టించేందుకు రౌడీ షీటర్ సత్య ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ గూండాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటే.. కొందరు పోలీసులు చోద్యం చూస్తూ కూర్చోవడం సరికాదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అలజడులు సృష్టిస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.