మూడు టాయిలెట్లు కట్టలేని సీఎం..మూడు రాజధానులు ఎలా కడతారు: చంద్రబాబు
Chandrababu Naidu : రెండున్నరేళ్లలోనే జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మూడు టాయిలెట్లు కట్టలేని సీఎం...మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు.;
Chandrababu Naidu : రెండున్నరేళ్లలోనే జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మూడు టాయిలెట్లు కట్టలేని సీఎం...మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, అనంతపురం జిల్లాకు చెందిన షేక్ షా వలి టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఢిల్లీలో వైసీపీ సర్కార్ బిచ్చం ఎత్తుకుంటోందన్నారు చంద్రబాబు. జగన్ పులి కాదు..హోదా అడగలేని పిల్లి అన్నారు. అమరావతిని గ్రాఫిక్స్ అన్న వైసీపీ నేతలు...హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధి చూడాలన్నారు. మైనార్టీల అభివృద్ధి టీడీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చినా....పాలన అంత సులభం కాదన్నారు చంద్రబాబు. ఆ స్థాయిలో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు.