వైసీపీ హయాంలో రౌడీలదే రాజ్యంగా మారిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. జగన్ వాళ్లనే ఎక్కువగా ప్రోత్సహించారని.. అందుకే ఆ ఐదేళ్ల టైమ్ లో గల్లీకి ఒక రౌడీ తయారయి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. అలాంటి వారికి తన హయాంలో అస్సలు చోటు లేదని తేల్చి చెప్పారు. అలాంటి వారిని అవసరం అయితే రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీలో రౌడీలకు చోటు లేకుండా చేస్తున్నామన్నారు. కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని.. రౌడీలను మొత్తం కంట్రోల్ చేస్తున్నట్టు తెలిపారు. లా అండ్ ఆర్డర్ ను జగన్ తుంగలో తొక్కేసి ఇలాంటి వారిని ఎంకరేజ్ చేశాడన్నారు చంద్రబాబు నాయుడు.
జగన్ హయాంలో రెచ్చిపోయిన రౌడీలు.. భూ కబ్జాలు, సెటిల్ మెంట్లు, దందాలు నిర్వహించి ప్రజలను నానా ఇబ్బందులు పెట్టినట్టు గుర్తు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక అలాంటి వారిని పూర్తిగా తగ్గించిందన్నారు. వారి పెత్తనాన్ని కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ ను అమలు చేస్తున్నామని.. రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నట్టు తెలిపారు. అందుకే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు చంద్రబాబు నాయుడు. నిజమే కదా.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా రప్పా రప్పా అంటూ రెచ్చిపోతున్నారు వైసీపీ బ్యాచ్.
అలాంటిది అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో అరాచకాలు చేశారో ఒకసారి మనం ఆలోచించాలి అంటున్నారు కూటమి నేతలు. అలాంటి బ్యాచ్ ను మళ్లీ అధికారంలోకి రానిస్తే ఇక ఏపీని సర్వనాశనం చేయడం ఖాయం అంటున్నారు కూటమి నాయకులు. కాబట్టి చంద్రబాబు విజనరీతో ఏపీ మొత్తం అభివృద్ధి చెందేదాకా అలాంటి బ్యాచ్ ను అరికట్టడమే చాలా బెటర్ అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అశాంతి రాజేయడానికి వైసీపీ చాలానే ప్రయత్నాలు చేస్తోంది. కానీ వాటిని కూటమి ఉక్కుపాదంతో అణచివేస్తోంది.