ఏపీలో కూల్చివేతలే తప్ప.. కట్టింది ఒక్కటి లేదు : టీడీపీ అధినేత చంద్రబాబు

ఏపీలో కూల్చివేతలే తప్ప కట్టింది ఒక్కటి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్‌ విధ్వంసాలకు పునాది వేసి నేటికి రెండేళ్లయిందన్నారు.;

Update: 2021-06-25 12:00 GMT

Nara chandrababu Naidu (File Photo)

ఏపీలో కూల్చివేతలే తప్ప కట్టింది ఒక్కటి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్‌ విధ్వంసాలకు పునాది వేసి నేటికి రెండేళ్లయిందన్నారు. దానితో తన పాలనా స్వభావాన్ని ప్రజలకు తెలియజేశారన్నారు. వైసీపీ రెండేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని విమర్శించారు చంద్రబాబు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తిరోగమన బాట పట్టాయన్నారు. ప్రజల వాక్‌ స్వాతంత్ర్యాన్ని, హక్కులను కాలరాస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఫైరయ్యారు. ఏపీని పాలించిన సీఎంలంతా ఎంతో కొంత ప్రజలకు మేలు చేశారే తప్ప రాష్ట్రాన్ని ఈ విధంగా తిరోగమన బాట పట్టించలేదని విమర్శించారు. రెండేళ్లలోనే ఇలా ఉంటే వచ్చే మూడేళ్లలో రాష్ట్రం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News