Chandrababu Naidu : చంద్రబాబుకు అరుదైన అవార్డు.. పనితీరుకు నిదర్శనం..

Update: 2025-12-18 09:00 GMT

సీఎం చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో తెలియజేసే అరుదైన అవార్డు దక్కింది. ఇండియాలోనే ప్రముఖ వాణిజ్య దినపత్రిక అయిన ఎకనామిక్ టైమ్స్ తాజాగా చంద్రబాబు నాయుడుకు అరుదైన అవార్డు ప్రకటించింది. బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా చంద్రబాబు నాయుడుని ప్రకటించింది ఈ పత్రిక. ఇప్పటివరకు ఎకనామిక్ టైమ్స్ కేవలం ప్రముఖ వ్యాపారవేత్తలకు మాత్రమే ఈ అవార్డులను ప్రకటిస్తూ వస్తోంది. కానీ మొదటిసారి ఒక పొలిటికల్ లీడర్ విజన్ కు మెచ్చి ఈ అవార్డును ప్రకటించింది. ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్న ఏకైక రాజకీయ వేత్తగా చంద్రబాబు నిలిచారు. దీన్నిబట్టే ఆయన ఏ స్థాయిలో ఏపీకి పెట్టుబడులు తీసుకువస్తున్నారో అనేది క్లియర్ గా అర్ధమైపోతుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 10.07 లక్షల కోట్ల పెట్టుబడులను ఏపీకి తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబుకే దక్కింది. భారీ స్థాయిలో పెట్టుబడులను తీసుకువస్తూనే ఇంకోవైపు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తూ అన్ని రకాలుగా ఏపీని ముందుకు తీసుకెళుతున్నారు. ఏపీని పెట్టుబడుల హబ్ గా మార్చడంలో చంద్రబాబు విజన్ సూపర్ సక్సెస్ అయింది. అందుకే ఇప్పుడు దేశంలోనే అత్యధిక పెట్టుబడులు వస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరాలను దాటేసి ఏపీకి పెట్టుబడులు తేవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో చతురతతో బిజినెస్ విజన్ తో పాటు అహర్నిశలు కష్టపడితేనే ఇది సాధ్యమైంది. పెట్టుబడులు ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు కాబట్టి ఆ విజన్ ను మరోసారి అమలు చేసి సక్సెస్ అయ్యారు.

ఈ వయసులో కూడా ఆయన క్షణం కూడా తీరిక లేకుండా ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్తలతో భేటీలు అవుతూ వారిని ఒప్పించి మరీ పెట్టుబడులు పెట్టిస్తున్నారు. వైసీపీ హయాంలో భయభ్రాంతులకు లోనై వెళ్లిపోయిన పెట్టుబడిదారులను కూడా తిరిగి వెనక్కు రప్పిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏపీలో గూగుల్ డేటా సెంటర్ లాంటి అతిపెద్ద కంపెనీ కూడా వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. చంద్రబాబు నాయుడుకు విజన్ ఉంది కాబట్టే ఇది సాధ్యమైంది. వైసిపి ఎన్ని విమర్శలు చేసినా సరే వాటిని ప్రజలు పట్టించుకోవట్లేదు. ఇలాంటి అవార్డులే చంద్రబాబు నాయుడు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో తెలియజేస్తున్నాయి.

Tags:    

Similar News