విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ..!
విశాఖ ఉక్కు కోసం టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాకు సిద్ధమని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.;
Nara chandrababu Naidu (File Photo)
విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విశాఖ ఉక్కు కోసం టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాకు సిద్ధమని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి టీడీపీ తరుపున నా సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రతిజ్ఞ చేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో 1960లో తెలుగు ప్రజలు స్టీల్‌ప్లాంట్‌ను సాధించారని గుర్తుచేశారు. ఎన్నో అవరోధాలను అధిగమించి 1992లో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం పూర్తయి దేశానికి అంకితం చేశారని తెలిపారు.