Vishakhapatnam : బయటపడ్డ ఫాస్టర్ భాగోతం.. దేవుడికి సేవ పేరుతో యువతుల్ని
Vishakhapatnam : దేవుడికి సేవ పేరుతో యువతుల్ని చెరబడుతున్న ఫాస్టర్ అంబటి అనిల్ కుమార్ భాగోతం బట్టబయలైంది.;
Vishakhapatnam : విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఫాస్టర్ దూరాగతం బయటపడింది. దేవుడికి సేవ పేరుతో యువతుల్ని చెరబడుతున్న ఫాస్టర్ అంబటి అనిల్ కుమార్ భాగోతం బట్టబయలైంది. విజయవాడకు చెందిన అనిల్... ప్రేమా స్వరూపి మినిస్ట్రీస్ పేరుతో ప్రేమదాస్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. అందులో 30 మంది యువతులు పనిచేస్తున్నారు. దేవుని సేవ పేరుతో జనాల దగ్గర నుంచి కోట్లలో డబ్బు వసూలు చేసిన అనిల్... స్థానిక మహిళ రాజేశ్వరి అలియాస్ లిల్లీ సహకారంతో యువతుల్ని చెరబట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణాకు చెందిన యువతి ఫిర్యాదుతో ఫాస్టర్ బాగోతం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఆంధ్రా, తెలంగాణతో పాటు దేశ విదేశాల్లో అనిల్ బారిన పడిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఫాస్టర్‌ను, అతనికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.