Andhra Pradesh News : సమ్మిట్ సూపర్ హిట్.. అంచనాలకు మించి సక్సెస్

Update: 2025-11-17 06:30 GMT

విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు సూపర్ హిట్ అయింది. వైసిపి హయాంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా కంపెనీల ప్రతినిధులు భయపడి పారిపోయారు. అప్పుడు పారిపోయిన వారందరినీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నచ్చజెప్పి వెనక్కి తీసుకొస్తుంది. ఏపీలో మరీ ముఖ్యంగా విశాఖలో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇందులో భాగంగా రెండు రోజులపాటు నిర్వహించిన సిఐఐ సదస్సు భారీ హిట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అంచనా వేసిన దాని కంటే ఎక్కువ మంది వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సమ్మిట్ కోసం చంద్రబాబు నాయుడు చేసిన ప్రీ ప్లాన్ మంచి ఫలితాలను ఇచ్చింది.

చంద్రబాబు నాయుడు దుబాయ్ వెళ్లి అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు అయి విశాఖ సబ్మిట్ కు ఆహ్వానించారు. అటు నారా లోకేష్ కూడా ఆస్ట్రేలియా వెళ్లి అంతర్జాతీయ కంపెనీలో ప్రతినిధులతో మాట్లాడి సమ్మిట్ కు రావాల్సిందిగా ఆహ్వానించడం వల్ల చాలామంది ముందుకు వచ్చారు. ఈ సమ్మిట్ లో ఏకంగా 13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అంగీకారాలు జరిగాయి.

ఏపీ ప్రభుత్వానికి సదరు కంపెనీల ప్రతినిధులకు మధ్య దాదాపు 613 ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల వల్ల 16.31 లక్షల మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి. గతంలో వైసిపి చెప్పినట్టు పేపర్ల మీదకే పరిమితం కాకుండా.. ఈ ఒప్పందాలన్నీ ఏడాదిన్నర లోపు అమలు జరుగుతాయని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వాటి ఫలితాలు కూడా ఏపీ ప్రజలు చూస్తారని.. అంతర్జాతీయ స్థాయిలో విశాఖ బ్రాండ్ ఏర్పడిందన్నారు.


Full View

Tags:    

Similar News