నేడు (శనివారం, ఆగస్టు 23, 2025) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు పెద్దాపురంలో కొత్తగా నిర్మించిన 'మ్యాజిక్ డ్రెయిన్'ను ఆయన పరిశీలిస్తారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటిస్తారు. ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను సందర్శించి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు సోషల్ మీడియా ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు. అనంతరం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం పెద్దాపురం నుంచి హెలికాప్టర్‌లో ఉండవల్లికి తిరిగి వెళ్తారు. ఈ పర్యటన ద్వారా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.