Ys Jagan : సంక్షేమ పథకాలకు మద్యం రాబడే ఆధారమని ఒప్పుకున్న సీఎం జగన్
Ys Jagan : మద్యం ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రానికి ఎంత అవసరమో అసెంబ్లీలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు జగన్;
Ys Jagan : మద్యం ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రానికి ఎంత అవసరమో అసెంబ్లీలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు జగన్. మద్యం బాగా తాగించి, వాటి అమ్మకాలు పెరిగితేనే కదా.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయగలం అన్నట్టుగా మాట్లాడారు. ఏపీలో మద్యం అమ్మకాలు పెరక్కుండా, మద్యం ఆదాయం రాకుండా, ఆ ఆదాయంతో అక్కచెల్లెమ్మలకు మంచి చేయనీయకుండా చంద్రబాబు కుట్ర పన్నుతున్నారంటూ తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు జగన్. మద్యపాన నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగనే.. ఇప్పుడు మద్యం ఆదాయం తగ్గించే కుట్రలంటూ రివర్స్ గేర్ వేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు