CM Jagan Tirumala : తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

CM Jagan Tirumala : ఏపీ సీఎం జగన్‌.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Update: 2021-10-11 15:45 GMT

CM Jagan Tirumala : ఏపీ సీఎం జగన్‌.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం 2022 టీటీడీ క్యాలెండర్‌ను జగన్‌ ఆవిష్కరించారు. ఆయన వెంట దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి ఉన్నారు.

రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో సీఎం జగన్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్‌.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు.

అక్కడ నుంచి తిరుమల చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని జగన్‌ దర్శించుకున్నారు.

Tags:    

Similar News