Kakinada : పైకి తేలుతున్న కరోనా డెడ్‌బాడీలు..
Kakinada : స్మశానంలోకి వరద చేరడంతో శవం పైకితేలిన ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగులోకి వచ్చింది;
Kakinada : స్మశానంలోకి వరద చేరడంతో శవం పైకితేలిన ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగులోకి వచ్చింది. భారీ వర్షాలకు ఏలేరూ కాలువ పొంగిపొర్లుతుంది. దీంతో ఏలేరూ కాలువ సమీపంలో ఉన్న స్మశానంలోకి వరద చేరింది. దీంతో స్మశానంలోని శవాలు నీటిలో పైకి తేలుతున్నాయి. శవాలకు బ్లాక్ కవర్ చుట్టి ఉండటంతో.. కోవిడ్‌తో మృతిచెందిన వారి శవాలుగా స్థానికులు భావిస్తున్నారు. ఇక శవాలు పైకి తేలడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.