ప్రకాశం జిల్లాలో పాఠశాలలకు కరోనా భయం
ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. ముఖ్యంగా పాఠశాలలు రీ ఓపెన్ చేసిన తర్వాత కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది.. విద్యార్థులు, టీచర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ..;
ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. ముఖ్యంగా పాఠశాలలు రీ ఓపెన్ చేసిన తర్వాత కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది.. విద్యార్థులు, టీచర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది.. స్కూళ్లు రీ ఓపెన్ చేసిన తర్వాత కేసులు రావడంతో విద్యార్థులతోపాటు, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రకాశం జిల్లాలో నాలుగు జెడ్పీ హైస్కూళ్లలో టీచర్లు, విద్యార్థులకు కరోనా సోకింది. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఓ టీచర్‌కు కరోనా సోకింది.. త్రిపురాంతకం హైస్కూల్‌లో ఓ టీచర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.. పీసీపల్లిలోని హైస్కూల్‌లో ఓ స్టూడెంట్, టీచర్‌కు వైరస్ ఉన్నట్లుగా తేలింది. పెద్దగొల్లపల్లి హైస్కూల్‌లో ఓ టీచర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది.. స్కూళ్లు మళ్లీ ఓపెన్ చేసిన తర్వాత కేసులు పెరగడంతో విద్యార్థులు భయాందోళనలు చెందుతున్నారు.. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు చెప్పారు.. విద్యార్థులు, టీచర్లకు అవగాహన కల్పించామని చెప్పారు. అలాగే అన్ని పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.