Couple Suicide : చెట్టుకు ఉరివేసుకొని జంట ఆత్మహత్య

Update: 2025-07-07 10:15 GMT

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలోని నిర్మానుషా ప్రదేశంలో చెట్టుకు ఓ జంట ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన కంబగిరి రాముడు, భారతిగా పోలీసులు గుర్తించారు. జంటకు కొన్ని సంవత్సరాలుగా సన్నిహిత సంబంధాలు ఏర్పడి అది ప్రేమగా మారింది. కానీ అప్పటికే భారతికి వేరే వ్యక్తితో వివాహం జరగడంతో పెద్దలు మందలించారు. రాముడిపై పెంచుకున్న ప్రేమతో భారతి భర్తకు రెండుసంవత్సరాల నుంచి దూరంగా ఉంటూ పుట్టింట్లో ఉంటుంది. భారతి వరసకు రాముడికి చెల్లెలు కావడంతో పెద్దలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురిని విడదీస్తారని భయంతో నంద్యాల నుంచి శనివారం రాత్రి కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలోకి వచ్చి భారతి, రాముడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు ఆత్మహత్య చేసుకునే ముందు వాట్సాప్ లో ఆత్మహత్య చేసుకున్న లోకేషన్ ని తండ్రికి వాట్సాప్ లో పంపి ఆత్మహత్య చేసుకున్నారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు వెల్లడించారు.

Tags:    

Similar News