ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర నిన్న రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. 45 రోజులు పాటు అమ్మవారి జాతర కొనసాగనుంది. జాతరలో భాగంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ తీర్థ మహోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. పెద్దాపురం పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు