TTD EO: టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి పూర్తిస్థాయి బాధ్యతలు.. మరి జవహర్‌రెడ్డికి..?

TTD EO: త్వరలోనే టీటీడీ ఈవోను మారుస్తున్నారనే విషయాన్ని వారం కిందటే చెప్పింది టీవీ5.

Update: 2022-05-08 09:45 GMT

TTD EO: టీటీడీ ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన అదనపు ఈవోగా ఉన్నారు. KS జవహర్‌రెడ్డి TTD EOగాను, CMOలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగారు. ఐతే.. పని ఒత్తిడి కారణంగా జవహర్‌రెడ్డి వారాంతాల్లో మాత్రమే తిరుమల తిరుపతి విషయాలపై సమీక్షించేవారు. ఈ నేపథ్యంలో TTDకి పార్ట్‌ టైమ్‌ ఈవోను కొనసాగిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

ఇటీవల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్రమైన ఇబ్బందులు పడడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జవహర్‌రెడ్డిని EOగా రిలీవ్‌ చేస్తూ, ఆయన స్థానంలో ధర్మారెడ్డికే పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రోజూ 70 వేల నుంచి లక్ష మంది భక్తులు కొండకు వస్తున్న నేపథ్యంలో.. EO నిరంతరం అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టే ధర్మారెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించారు.

త్వరలోనే ఈవోను మారుస్తున్నారనే విషయాన్ని వారం కిందటే చెప్పింది టీవీ5. సీఎం తిరుపతి పర్యటన తర్వాత ఆయన్ను బదిలీ చేస్తారంటూ కథనాలు ప్రసారం చేసింది. అనుకున్నట్టే ఇప్పుడు KS జవహర్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇవాళ సాయంత్రమే జవహర్‌రెడ్డికి TTD అధికారులు వీడ్కోలు పలకనున్నారు. ఈనెల 14వ తేదీ వరకూ AEO ధర్మారెడ్డికి డిప్యూటేషన్ గడువు ఉంది. దీన్ని మరో 2 ఏళ్లు పొడిగించాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఆయన సేవలు రెండేళ్లు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇప్పుడు కేంద్రం అంగీకరిస్తే ధర్మారెడ్డి TTDలోనే కొనసాగనున్నారు. 

Tags:    

Similar News