DRONE SHOW: అదరహో అనిపించిన డ్రోన్ షో

వేలాది నక్షత్రాలుగా కనిపించిన డ్రోన్లు... బుద్ధుడి ప్రతిరూపం నుంచి విమానం దాకా ఆకృతులు;

Update: 2024-10-23 03:00 GMT

విజయవాడలోని కృష్ణా తీరంలో డ్రోన్లు వివిధ కళాకృతులతో అందరినీ అలరించాయి. విమానం, బుద్ధుడు, గ్లోబ్ పై భారతదేశ మ్యాప్, డ్రోన్ కల్చర్, 1911 నాటి పోస్టల్ స్టాంపు, భారత త్రివర్ణ పతాకం… ఇలా వివిధ రూపాల్లో డ్రోన్ లైటింగ్ షో కనులవిందు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు.


డ్రోన్‌ షోతో పాటు లేజర్‌ షోను ఏర్పాటు చేశారు. డ్రోన్‌ షోను వీక్షించేలా ఐదు చోట్ల డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు. డ్రోన్ షోతోపాటు లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.


ప్రదర్శనను తిలకించేందుకు కృష్ణా తీరానికి భారీగా సందర్శకులు తరలివచ్చారు. కృష్ణా తీరమంతా సందర్శకులతో నిండిపోయింది. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ డ్రోన్‌ షోకు హాజరయ్యారు.


ఒక్కసారిగా ఆకాశంలో నక్షత్రాలుగా 5,500 డ్రోన్లు పైకి లేచాయి. ఆకాశంలో వేలాది నక్షత్రాలుగా కనిపించిన డ్రోన్లు.. ఆ తర్వాత కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ను డ్రోన్‌ సెన్సార్లు స్వీకరించి అత్యద్భుత ప్రదర్శన చేశాయి.


డ్రోన్‌ హ్యాకథాన్‌లో విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా చెక్కులు అందజేశారు.



Tags:    

Similar News