Eluru Mayor : పదవి భార్యది.. పాలన భర్తది.. : విపక్షాల ఆరోపణ

Eluru Mayor:ఉన్నతాధికారులతో పాటు సమీక్షలు చేస్తూ కార్పొరేషన్‌లో పెత్తనం చెలాయిస్తున్నాడు

Update: 2021-10-22 05:53 GMT

Eluru Mayor: భార్యల పదవులను భర్తలు అలంకరించడం మామూలే!కానీ ఏకంగా గెజిటెడ్‌ అధికారులతోనూ రివ్యూలు చేయోచ్చా? మేయర్‌తో పాటు ఆయనకు కుర్చీ వేయచ్చా? అంటే..... అదంతా నా ఇష్టం అంటున్నారు ఏలూరు నగర పాలక సంస్థ మేయర్ భర్త పెదబాబు.

కమీషనర్‌తో సహా ఇతర ఉన్నతాధికారులతో పాటు సమీక్షలు చేస్తూ కార్పొరేషన్‌లో పెత్తనం చెలాయిస్తున్నాడు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న పెదబాబుపై చర్యలు తీసుకోవాలంటున్నాయి విపక్షాలు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడంతా రాజారెడ్డి పాలన నడుస్తోందంటూ విమర్శిస్తున్నాయి విపక్షాలు. పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీనేతలు వ్యవహరిస్తున్న తీరే నిదర్శనమంటున్నారు.

ఇప్పటికే జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భార్యలు ప్రజాప్రతినిధులుగా గెలిస్తే, భర్తలు ఆ అధికారాన్ని అనుభవిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతుండడంపై ఏకంగా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి పేర్ని నాని సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

భార్యల కుర్చీల్లో భర్తలు కూర్చోవద్దని, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడవద్దని భీమవరం లో పార్టీ నేతల్ని ఆదేశించారు. కానీ మంత్రి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు వైసీపీ నేతలు

Tags:    

Similar News