Andhra Pradesh: ఏపీ దేవాదాయ శాఖలో అమ్మకానికి ఈవో పోస్టులు?
Andhra Pradesh: ఏపీలో ఉద్యోగ నోటిఫికేషన్లు డబ్బులకు అమ్ముకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.;
Andhra Pradesh: ఏపీలో ఎప్పుడో గాని ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదు. వచ్చిన వాటిని డబ్బులకు అమ్ముకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ దేవాదాయ శాఖలో ఈవో పోస్టులను సైతం ఇలాగే బేరానికి పెట్టారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఈవో పోస్టులను ఆలయ ఉద్యోగులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు జరిపేందుకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ.. పరిస్థితి వేరేలా ఉంది.
ఒక్కో పోస్టును 5 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయశాఖ తీరుపై నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొత్తం 44 గ్రేడ్-3 ఈవో పోస్టులను టెంపుల్ ఉద్యోగులతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులు నష్టపోతారని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాసులకు కక్కుర్తిపడి ఉద్యోగాలు అమ్ముకోవడం నిరుద్యోగ యువతను వంచిండమేనని యువజన సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.