రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది : భూమా అఖిలప్రియ

Update: 2020-10-10 09:16 GMT

అమరావతి రైతులు 300 రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవటం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రభుత్వం గుర్తించాలన్నారు. రాష్ట్రాన్ని ముక్కలుగా విడదీసీ అందరి మధ్య గొడవలు పెడుతూ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. రాయలసీమకు న్యాయ రాజధాని అని తమను మభ్యపెడుతున్నారని అఖిలప్రియ అన్నారు. భవిష్యత్తులో మరే రాష్ట్రంతో ఏపీ పోటీపడే పరిస్థితి లేకుండా వెనక్కి తీసుకుపోతున్నారని విమర్శించారు. 

Tags:    

Similar News