ఏపీలో దళితులకు జీవించే హక్కు లేదా? : మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు
ఏపీలో దళితులకు జీవించే హక్కు లేదా? : మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు;
ఏపీలో దళితులు జీవించే హక్కును వైసీపీ ప్రభుత్వ కాలరాస్తోందని... మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. దళితులపై దమనకాండకు వ్యతిరేకంగా గుంటూరులో నిరసనదీక్ష చేపట్టిన ఆనంద్‌బాబు... జగన్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అధికారంలోకి రావడానికి కారణమైన 90 శాతం దళితులపై దాడులు, శిరోముండనాలు చేస్తూ... అతిదారుణంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఘటనలో నూతన్ నాయుడిపై కేసు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. మీకు దమ్ముంటే తమ హాయంలో జరిగిన వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలపై... చర్చలకు సిద్ధమా అని నక్కా ఆనంద్‌బాబు సవాల్ చేశారు.