Tirupati: తిరుపతిలో జగన్‌పై అభిమానుల ఆగ్రహం
Tirupati: ముఖ్యమంత్రి జగన్ అభిమానులు కూడా నిరసనలతో రోడ్డెక్కుతున్నారు..;
Tirupati: వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నాయి. ప్రజలే కాదు.. ముఖ్యమంత్రి జగన్ అభిమానులు కూడా నిరసనలతో రోడ్డెక్కుతున్నారు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచారంటూ తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు.. ఐదు రోజులుగా నడిరోడ్డుపై నిరసన తెలుపుతున్నా.. అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గానీ... ఇటు టీటీడీ ఉన్నతాధికారులు కానీ పట్టించుకోవడం లేదంటూ టీటీడీ ఎఫ్ఎంఎస్ కాంట్రాక్ట్ కార్మికులు వాపోతున్నారు. జగన్‌పై అభిమానంతో చేతిపై టాటూ వేయించుకున్న ఓ మహిళ.. టాటూపై కొడుతూ అన్న అని పిలిచినందుకు నడిరోడ్డుపై నిలబెట్టాడంటూ కన్నీటి పర్యంతమైంది.