చొక్కా విప్పించి, కాళ్లూ చేతులు ముడిపెట్టి.. హింసించిన వైసీపీ నేతలు
సొంతపార్టీ నేత, మాజీ ఎంపీటీసీ బైరెడ్డి చెన్నకేశవరెడ్డిని కిడ్నాప్ చేసి హింసించారు వైసీపీ నేతలు.;
ఏపీలో వైసీపీ అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. తమకు అడ్డొస్తే సొంత పార్టీ నేతలైనా చూడటం లేదు. నంద్యాల జిల్లా అవుకులో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. సొంతపార్టీ నేత, మాజీ ఎంపీటీసీ బైరెడ్డి చెన్నకేశవరెడ్డిని కిడ్నాప్ చేసి హింసించారు వైసీపీ నేతలు. చనుగొండ్ల గ్రామంలో ఈఘటన జరిగింది. చల్లా విఘ్నేశ్వర్‌రెడ్డి, బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గాల మధ్యే పోరే దీనికి కారణమని తెలుస్తోంది.
చల్లా వర్గానికి చెందిన మాజీ ఎంపీటీసీ బైరెడ్డి కేశవరెడ్డి రాత్రి భోజనం చేశాక మాత్రలు తెచ్చుకోవడానికి గ్రామంలోని ఓ దుకాణం వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గీయులు కంకర పద్మనాభరెడ్డి, రామిరెడ్డి, సుంకిరెడ్డి, శంకరరెడ్డి, వేణుగోపాలరెడ్డి తదితరులు అతనితో గొడవ పడ్డారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ తిట్టారు. చెన్నకేశవరెడ్డి ఎదురుతిరగడంతో అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. చొక్కా విప్పించి, కాళ్లూచేతులుముడిపెట్టి చెట్టుకు కట్టేశారు. రాడ్లతో దారుణంగా కొట్టారు.రాత్రంతా తీవ్రంగా హింసించారు.దీంతో ఆయన స్పృహ కోల్పోయారు.
స్థానికులు ఫోటోలు బయటికి ఫోస్ట్ చేయడంతో బాధితుడి బంధువులు ఆయన్ను విడిపించుకున్నారు. పాతకక్షలు, ఆధిపత్య పోరే కారణాలని భావిస్తున్నారు పోలీసులు. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 మందిపై కేసులు పెట్టారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.