Fire Accident In Vizag: వైజాగ్ కార్ డెకర్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు, వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు;
విశాఖలోని 4టౌన్ పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వైజాగ్ కార్ డెకర్స్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో పక్కనే ఉన్న షాపులకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో మూడు షాపులు పూర్తిగా దగ్దం అయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు, వాహనదారుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో అతికష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.