East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
East Godavari : నేదునూరు పెదపాలెం సావరం కాలనీలో కొత్త వేరియంట్ కేసు వెలుగు చూడటంతో.. కోనసీమలో ఒక్కసారిగా కలకలం రేగింది.;
East Godavari : తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో.. ఒమిక్రాన్ కేసు నమోదైంది. నేదునూరు పెదపాలెం సావరం కాలనీలో కొత్త వేరియంట్ కేసు వెలుగు చూడటంతో.. కోనసీమలో ఒక్కసారిగా కలకలం రేగింది. కువైట్ నుంచి వచ్చిన మహిళ ఒమిక్రాన్ బారిన పడినట్లు వైద్యాధికారులు గుర్తించారు. దీంతో ముందుగా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లందరికీ రాపిడ్ టెస్టులు నిర్వహింస్తున్నారు. మిగిలిన వారెవరికీ పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని వైద్యులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన మహిళను హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తునట్లు వివరించారు.