Srisailam Reservoir : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

Update: 2025-07-26 07:30 GMT

శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు జలాశయం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్-ఫ్లో 75,383 క్యూసెక్కులుగా నమోదవుతోంది. శ్రీశైలం జలాశయం రెండు రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల వరకు ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ఔట్-ఫ్లో 1,21,482 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం ఇది 883.50 అడుగులకు చేరుకున్నది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వర్షాలు కొనసాగితే, వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News