పోలీసుల తీరుపై మండిపడిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి
కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ప్రారంభించాలంటూ టీడీపీ చేపట్టిన మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి..;
కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ప్రారంభించాలంటూ టీడీపీ చేపట్టిన మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. పోలీసుల తీరుకు నిరసనగా... చిత్తూరు కలెక్టర్, ఎస్పీలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు ఎన్టీఆర్ బీజం వేస్తే... చంద్రబాబు దాదాపు పూర్తి చేశారన్నారు. తంబళ్లపల్లె నుంచి పలమనేరు వరకు పనులు పూర్తి చేయించారన్నారు. పెండింగ్‌లో ఉన్న 14శాతం పనులు పూర్తి చేయాలంటూ.... టీడీపీ మహాపాదయాత్ర చేపట్టిందన్నారు. జగన్ ప్రభుత్వం కావాలనే... ఈ ప్రాజెక్ట్‌ను ఆపివేసిందన్నారు. తక్షణమే హంద్రీనివా కాలువ ద్వారా... జిల్లాలోని చెరువుల్ని నింపాలని డిమాండ్ చేశారు.