Minister Roja : కష్టాల్లో మాజీ మంత్రి రోజా.. క్రీడల్లో అవినీతిపై రంగంలోకి సీఐడీ

Update: 2024-08-16 09:15 GMT

మాజీ మంత్రి రోజా కష్టాల్లో పడ్డారు. గత YSRCP హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌లో అక్రమాలను వెలికి తీసేందుకు CID రంగంలోకి దిగింది. ఈ ఆటలకు సంబంధించి ప్రభుత్వం దాదాపు 150 కోట్లు ఖర్చుచేసింది.

పోటీల కోసం కొనుగోలు చేసిన క్రీడా సామగ్రిలో నాణ్యతలేదని, నాచిరకం సామగ్రిని కొని డబ్బులు దండుకున్నారన్న ఫిర్యాదులు అందాయి. అప్పటి క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అప్పటి అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాయి. దీంతో ఈ విషయంపై పోకస్‌ పెట్టిన కూటమి ప్రభుత్వం CID విచారణకు ఆదేశించింది.

Tags:    

Similar News