YCP సర్కార్‌పై మాజీ MLA కొమ్మాలపాటి శ్రీధర్ ఫైర్
సీఎం క్రోసూరు సభకు జనసమీకరణ కోసం బలవంతంగా ప్రైవేటు బస్సులు తరలించారన్నారు;
వైసీపీ సర్కార్‌పై మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఫైరయ్యారు. సీఎం క్రోసూరు సభకు జనసమీకరణ కోసం బలవంతంగా ప్రైవేటు బస్సులు తరలించారన్నారు. ఇక ఉపాధి హామీ కూలీను బెదిరించి సభకు తీసుకెళ్లారని ఆరోపించారు. జగన్ సభకు బస్సులన్నీ వెల్లడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని మండిపడ్డారు. ఇక నాలుగేళ్ల వైసీపీ పాలనలో పెదకూరపాడులో అభివృద్ధి శూన్యమన్నారు. శంకుస్థాపనలకే జగన్ పరిమితం అయ్యారని కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు.