YV Subba Reddy Mother : మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం

Update: 2025-03-17 07:45 GMT

వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఎర్రం పిచ్చమ్మ(85) ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మాతృమూర్తి మృతితో వైవీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, వైసీపీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్ధం సోమవారం పిచ్చమ్మ పార్దీవ దేహాన్ని వైవీ సుబ్బారెడ్డి నివాసం వద్ద ఉంచనున్నట్లు తెలిపారు. సాయంత్రం సమయంలో వైవీ సుబ్బారెడ్డి స్వగ్రామమైన మేదరమెట్లకు పిచ్చమ్మ పార్ధీవదేహాన్ని తరలించి మంగళవారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. అయితే, పిచ్చమ్మ పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిలతోపాటు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News