Tirupati: తిరుపతిలో మరో‌సారి బాంబు బెదిరింపులు

Update: 2024-10-27 06:15 GMT

తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. స్థానిక రాజ్‌పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే హోటల్‌కు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు కాల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం నాలుగు హోటళ్లకు మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. బెదిరింపులు వచ్చిన హోటళ్లను పోలీసులు తనిఖీ చేశారు. తిరుపతి కేటీ రోడ్డులోని ఆలయానికి కూడా బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది.

5 స్టార్ హోటళ్లకు బాంబు బెదిరింపు

గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపాయి. నగరంలోని 5 స్టార్ హోటళ్లతో సహా 10 హూటళ్లకు నేడు (శనివారం) ఈ మెయిల్ ద్వారా బాంబు బెదింపులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. బెదిరింపులు వచ్చిన హూటళ్లలో తనిఖీలు చేపట్టారు. కాగా దీపావళి పండుగ వేళ బెదిరింపులు రావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News