అప్పుడు తప్పించుకున్న అంబటి.. ఇప్పుడు వరుస షాకులు..

Update: 2026-02-13 05:00 GMT

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబును దూషించిన కేసులో ఆయన రిమాండ్ కు వెళ్లి బెయిల్ పొందారు. సీఎం చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టిన సందర్భంగా ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా 36 కేసులు నమోదైన విషయం తెలిసిందే కదా. ఈ కేసుల్లో ఆయన బెయిల్ పొందిన క్రమంలో గతంలో ఆయన మీద నమోదైన కేసులు ఒక్కొక్కటిగా తెరమీదకు వస్తున్నాయి. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేసిన సందర్భంగా అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆ కేసును ఇప్పుడు పోలీసులు తెరమీదకు తెచ్చారు. ఈ కేసులో కోర్టు రిమాండ్ కూడా విధించింది. అయితే అందులోనూ బెయిల్ వచ్చిందని సంబరపడ్డారు రాంబాబు. కానీ ఇంతలోనే పోలీసులు మరో షాక్ ఇచ్చారు.

2023లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సత్తెనపల్లిలో లక్కీ డ్రా నిర్వహించి ప్రజలను మోసం చేశారు. అప్పట్లో జనసేన నాయకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి రాంబాబును అరెస్ట్ చేయలేదు పోలీసులు. కానీ ఇప్పుడు ఆ కేసును తెరమీదకు తెచ్చి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యే క్రమంలో కోర్టులో హాజరుపరిచారు. ప్రజలను మోసం చేసినందుకు గాను కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం జైల్లోనే ఉండిపోయారు.

కానీ ఇక్కడ రాంబాబు ఒకటి గుర్తుంచుకోవాలి. వైసీపీ అధికారంలో ఉన్నంత మాత్రాన చట్టాలను తుంగలో తొక్కి ఆయన అరెస్ట్ కాకుండా ఉండగలిగారు. ఒక లాయర్ అయి ఉండి చట్టాలను గౌరవించని అంబటి రాంబాబును కచ్చితంగా శిక్షించాల్సిందే అని కూటమి నేతలు అంటున్నారు. ఒకవేళ ప్రజలను నిజంగానే లక్కీ డ్రా పేరుతో మోసం చేయకపోతే అదే విషయంలో లీగల్ గా పోరాడొచ్చు కదా. అలా చేయకుండా అధికారాన్ని అడ్డు పెట్టుకుని చట్టాలను అవమానిస్తే.. ఇలా జైల్లో గడపాల్సి వస్తుందని అంటున్నారు కూటమి నేతలు.

Tags:    

Similar News