Ganesh Fest: గణేశ్‌ మండపాన్ని పెడుతున్నారా ? ఈ రూల్స్‌ పాటించాల్సిందే

గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం;

Update: 2025-08-25 08:30 GMT

తె­లం­గాణ రా­ష్ట్ర వ్యా­ప్తం­గా గణే­శ్‌, దు­ర్గా­మాత మం­డ­పా­ల­కు ఉచిత వి­ద్యు­త్‌ ఇవ్వా­ల­ని రా­ష్ట్ర ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. అను­మ­తి తీ­సు­కు­న్న వి­నా­యక మం­డ­పా­ల­కు ఉచిత వి­ద్యు­త్​­ను అం­దిం­చ­ను­న్నా­రు. ఈనెల 27వ తేదీ నుం­చి గణే­శ్‌ ఉత్స­వా­లు ప్రా­రం­భం కా­ను­న్న వి­ష­యం వి­ది­త­మే. మరో­వై­పు హై­ద­రా­బా­ద్‌ నగ­రం­లో గణే­శ్‌ మం­డ­పాల ఏర్పా­ట్లు చు­రు­గ్గా సా­గు­తు­న్నా­యి. తె­లు­గు రా­ష్ట్రా­ల్లో ఎంతో ప్రా­ము­ఖ్యత పొం­దిన ఖై­ర­తా­బా­ద్‌ గణ­నా­థు­డి­ని వి­గ్రహ ని­ర్మా­ణం చి­వ­రి దశకు చే­రు­కుం­ది. 2025 ఆగ­స్టు 27 నుం­డి సె­ప్టెం­బ­ర్ 6 వరకు జర­గ­ను­న్న గణే­ష్ నవ­రా­త్రుల సం­ద­ర్భం­గా (11 రో­జు­లు), అలా­గే సె­ప్టెం­బ­ర్ 24 నుం­డి అక్టో­బ­ర్ 2 వరకు ని­ర్వ­హిం­చే దు­ర్గా­మాత నవ­రా­త్రి ఉత్స­వాల (9 రో­జు­లు) సం­ద­ర్భం­గా ఉచిత వి­ద్యు­త్‌ సదు­పా­యా­న్ని అం­దిం­చ­ను­న్నా­రు.ఈ మే­ర­కు అన్ని సూ­ప­రిం­టెం­డిం­గ్ ఇం­జి­నీ­ర్లు మరి­యు అకౌం­ట్స్ అధి­కా­రు­లు తగిన చర్య­లు తీ­సు­కో­వా­ల­ని వి­ద్యు­త్ శాఖ సర్క్యు­ల­ర్ జారీ చే­సిం­ది.మం­డ­పాల ని­ర్వ­హ­కు­లు తమ రి­జి­స్ట్రే­ష­న్ స్లి­ప్‌­ల­ను సం­బం­ధిత శా­ఖ­కు సమ­ర్పిం­చా­ల్సి ఉం­టుం­ది. భా­గ్య­న­గ­ర్ గణే­ష్ ఉత్సవ సమి­తి వి­న­తి మే­ర­కు ప్ర­భు­త్వం ఈ ని­ర్ణ­యా­న్ని తీ­సు­కుం­ది.దీ­ని­కి అను­గు­ణం­గా వి­ద్యు­త్ శాఖ ప్ర­త్యేక ఆదే­శా­లు జారీ చే­సిం­ది.

పోలీసుల సూచనలు

తె­లం­గా­ణ­లో వి­నా­యక చవి­తి సం­ద­డి మొ­ద­లైం­ది. మం­డ­పాల ఏర్పా­టు, బొ­జ్జ గణ­ప­య్య వి­గ్ర­హాల తర­లిం­పు ప్ర­క్రియ ఊపం­దు­కుం­ది. ఈ నే­ప­థ్యం­లో­నే తె­లం­గాణ పో­లీ­సు­లు వి­నా­యక మం­డ­పాల ని­ర్వా­హ­కు­ల­కు పలు కీలక ని­బం­ధ­న­లు, హె­చ్చ­రి­క­ల­ను జారీ చే­శా­రు. వి­గ్ర­హాల తర­లిం­పు, వి­నా­యక మం­డ­పాల ఏర్పా­టు, నవ­రా­త్రుల ని­ర్వ­హణ, ని­మ­జ్జ­నం తది­తర సమ­యా­ల్లో కచ్చి­తం­గా పా­టిం­చా­ల్సిన పలు జా­గ్ర­త్త­ల­ను, ని­య­మా­ల­ను సూ­చిం­చా­రు. గణే­శ్ మం­డ­పం ఏర్పా­టు కోసం ఆన్‌­లై­న్‌­లో పర్మి­ష­న్‌ తప్ప­ని­స­రి. పర్మి­ష­న్‌ కోసం అప్లై చే­సు­కొ­ని అను­మ­తి పొం­దా­ల్సి ఉం­టుం­ది. ఏపీ­లో ప్ర­తీ మం­డ­పా­ని­కి క్యూ­ఆ­ర్‌ కో­డ్‌ ఇస్తు­న్నా­రు. వే­డు­క­ల­ను ప్ర­శాంత వా­తా­వ­ర­ణం­లో ని­ర్వ­హిం­చు­కు­నే­లా సాం­కే­తిక పరి­జ్ఞా­నా­న్ని వి­ని­యో­గిం­చి మం­డ­పా­ల­కు అను­మ­తు­లు ఇస్తు­న్నా­రు. ఆగ­స్టు 27న ని­ర్వ­హిం­చ­ను­న్న వి­నా­యక చవి­తి వే­డు­క­ల­కు వీ­ధి­వీ­ధి­నా ఇప్ప­టి­కే మం­డ­పా­లు ఏర్పా­టు చే­స్తు­న్నా­రు. ఉత్సవ ని­ర్వా­హ­కు­ల­కు అను­మ­తుల జారీ సు­ల­భ­త­రం చే­శా­రు. ఎలాం­టి రు­సుం చె­ల్లిం­చ­కుం­డా ఆన్‌­లై­న్‌­లో సిం­గి­ల్‌­విం­డో వి­ధా­నం­లో మం­డ­పాల ఏర్పా­టు­కు అను­మ­తు­లు ఇస్తు­న్నా­రు.

మండపాల వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి. అలాగే ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించాలి. వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీకి తగ్గట్లు వినాయక మండపాలు ఏర్పాట్లు చేయాలి. వెహికిల్స్ పార్క్ చేసుకునేందుకు కూడా ప్రత్యేకంగా స్థలాలు కేటాయించాలి. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించకూడదు. ట్రాఫిక్, క్యూలైన్లను నియంత్రించేందుకు మండపాల వద్ద శుభ్రతను పాటించాల్సి ఉంటుంది. పాయింట్ బుక్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మండప నిర్వాహకుల కమిటీ సభ్యుల వివరాలు, కమిటీ ప్రెసిడెంట్/కన్వీనర్/సెక్రటరీ ఎవరో నమోదు చేయాల్సి ఉంటుంది.  

Tags:    

Similar News