Ganta Srinivasa Rao : ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు.;
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాశారు. కేంద్రం నిర్ణయం అమలులోకి వచ్చిన మరుక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అలాగే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జేఏసీ ఏర్పాటు చేస్తానని, ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తానని గంటా శ్రీనివాస రావు స్పష్టం చేశారు.