Bhadrachalam : భద్రాచలంలో గోదావరి ఉద్ధృతి.. ఇంద్రావతి వాగులు దాటొద్దని హెచ్చరిక
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి APలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
ఏపీలోని ఎటపాక మండలంలో రాయనపేట వద్ద రోడ్లు మునిగిపోవడంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు వెళ్లే వాహనాలు సైతం నిలిచిపోయాయి. ఎగువన గోదావరిలో కలిసే ఇంద్రావతి కొంత శాంతించి.. రాత్రి 8 గంటలకు 47.8 అడుగులకు నీటిమట్టం తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను విత్ డ్రా చేసుకున్నారు. 43 అడుగుల కంటే తగ్గితే మొదటి హెచ్చరికను కూడా ఎత్తివేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు.