గోడౌన్‌లో భారీ పేలుడు.. 50 అడుగుల దూరంలో ఎగిరిపడ్డ మృతదేహాలు

స్క్రాప్ గోడౌన్‌లో భారీ పేలుడు జరిగింది. పేలుడు తీవ్రతకు గోడౌన్ నుంచి 50 అడుగుల దూరంలో మృతదేహాలు ఎగిరిపడ్డాయి.;

Update: 2020-09-03 10:41 GMT

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి స్క్రాప్ గోడౌన్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. పేలుడు తీవ్రతకు గోడౌన్ నుంచి 50 అడుగుల దూరంలో మృతదేహాలు ఎగిరిపడ్డాయి. స్క్రాప్‌ కొనుగోలు చేసేందుకు తండ్రీకొడుకులు అక్కడికి వెళ్లినట్టు గుర్తించారు. మృతులు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తున్నారు. 

Tags:    

Similar News