Gottipati Ravi : గుడ్ న్యూస్.. ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు

Update: 2025-09-29 09:40 GMT

కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. దాతల సహకారంతో 35 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలను పంపిణీ చేశారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వచ్చే నెల నుంచి విద్యుత్ ఛార్జీలు ఒక్కో యూనిట్ పై 0.13పైసలు తగ్గిస్తున్నామని తెలిపారు. అంతకుముందు అద్దంకి పట్టణంలోని శ్రీ చక్రాసహిత వాసవి అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags:    

Similar News