ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో వారికి ప్రమోషన్స్ రానున్నాయి. ఈ దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం - నరేగాలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వనున్నారు. త్వరలోనే సీనియారిటీ జాబితా రూపొందించి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని ఆ శాఖ కమిషనర్ సూచించారు. ఈ నిర్ణయంపై ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.