Andhra Pradesh : కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం చాలా తగ్గిపోయింది : ఏపీ సీఎస్ సమీర్ శర్మ
Andhra Pradesh : ఏపీలో పీఆర్సీ, HRAలపై ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్న వేళ... సీఎస్ సమీర్ శర్మ వివరణ ఇచ్చారు.;
Andhra Pradesh : ఏపీలో పీఆర్సీ, HRAలపై ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్న వేళ... సీఎస్ సమీర్ శర్మ వివరణ ఇచ్చారు. కరోనాతో ప్రభుత్వ ఆదాయం చాలా తగ్గిపోయిందన్నారు శర్మ. 98వేల కోట్లు ఉండాల్సిన ఆదాయం 60వేల కోట్లకు పడిపోయిందన్నారు. థర్డ్ వేవ్‌తో ఆర్థిక పరిస్థితి మరీ దిగజారిపోయేలా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోవాలన్నారు సమీర్ శర్మ. ఇంతటి కరోనా కష్టకాలంలోనూ ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చామన్నారు. పీఆర్సీ ఆలస్యమవుతుందనే ఉద్దేశంతోనే ఐఆర్ ఇచ్చినట్లు తెలిపారు. ఇక కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవన్నారు సమీర్ శర్మ.