జూన్ 17 వరకు ఒంటిపూట బడులు... ఏపీ విద్యాశాఖ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లో వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో పాఠశాలల పున:ప్రారంభంపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.;
ఆంధ్రప్రదేశ్ లో వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో పాఠశాలల పున:ప్రారంభంపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి యథావిధిగా స్కూల్స్ ప్రారంభం అవుతున్నప్పటికీ ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. జూన్ 17 వరకు ఉ.7.30 నుంచి మ. 11.30 వరకు తరగతులు నిర్వహిస్తామని ప్రకటించింది. జూన్ 19(సోమవారం) నుంచి యథాతథంగా విద్యాప్రణాళిక షెడ్యూల్ అమలు కానుంది.