Nara Lokesh : రేపే హరిహర వీరమల్లు రిలీజ్.. లోకేష్ బెస్ట్ విషెస్..

Update: 2025-07-23 10:15 GMT

ఏపీడిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై అలరించనున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24 న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు చేసింది మూవీ యూనిట్. తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షో లు రానున్నాయి. అయితే పవన్ రాజకీయాలలోకి వచ్చి.. విజయం సాధించిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో ఇటు పొలిటికల్ సర్కిల్ లో కూడా ఈ సినిమా పై ఆసక్తి నెలకుంది. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

"మా పవన్ అన్న సినిమా విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేను సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ 'హరిహర వీరమల్లు' అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అని తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు నారా లోకేష్..

ఇక పవన్ పై ఎప్పుడూ విమర్శలు గుప్పించే వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు సైతం పవన్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన..సినిమా హిట్టే కనకవర్షం కురవాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చారు. దీనికి పవన్, నాగబాబును కూడా ట్యాగ్ చేశారు. అయితే ఇది కూడా సెటైర్ కావొచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో పవన్ ఒక యోధుడిగా, చారిత్రక పాత్రలో కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నాడు. 'హరిహర వీరమల్లు: పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పింట్ పేరిట ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

Tags:    

Similar News