Srisailam Projec : శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీ వరద పోటు

Update: 2025-08-19 12:15 GMT

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.80 అడుగులకు పైగా నీటి మట్టం నమోదైంది. పూర్తి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ఇప్పటికే 197.91 టీఎంసీలకు పైగా చేరింది. జలాశయానికి పెరుగుతున్న ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఐదు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీని వల్ల నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,30,876 క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 2,29,129 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

Tags:    

Similar News