Nellore: నెల్లూరులో వర్షాలు భీభత్సం.. పాఠశాలల ప్రాంగణంలోకి నీరు..
Nellore: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.;
Nellore (tv5news.in)
Nellore: నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నెల్లూరులో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి నెల్లూరులో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. అండర్ బ్రిడ్జిల కింద భారీగా నీరు నిలిచిపోయింది. అటు.. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు.
సూళ్లూరుపేటలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బాలయోగి గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల ప్రాంగణం జలమయమైంది. విద్యాలయంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. తరగతి గదులు, వసతి గృహం, వంట గదిలోకి నీరు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విష కీటకాలు వస్తాయేమోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.