ప్రాదేశిక ఎన్నికలపై SEC ఆదేశాలను సవరించిన హైకోర్టు
ప్రాదేశిక ఎన్నికలపై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలకు హైకోర్టు సవరణలు చేసింది. ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం;
ప్రాదేశిక ఎన్నికలపై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలకు హైకోర్టు సవరణలు చేసింది. ఏకగ్రీవాల విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రభుత్వం... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం... ఏకగ్రీవాలపై డిక్లరేషన్ ఫామ్ 10 ఇచ్చిన స్థానాల్లో విచారణ చేయవద్దని సూచించింది. అలాగే ఫామ్ 10 ఇవ్వని చోట్ల మాత్రం విచారణ చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణ చేపట్టిన స్థానాల్లోనూ ఈ నెల 23 వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని చెప్పిన హైకోర్టు.. తదుపరి విచారణ ఈ నెల 23 కు వాయిదా వేసింది.