Rushikonda: రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ
Rushikonda: విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండపై సర్వే చేయాలని సర్వే టీంకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.;
Rushikonda: విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండపై సర్వే చేయాలని సర్వే టీంకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతికి మించి ఎంతమేర తవ్వకాలు చేపట్టారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే భవనాల నిర్మాణాలపై కూడా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు కోర్టు వాయిదా వేసింది కోర్టు.
రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో వాడీవేడిగా వాదనలు నడిచాయి.. మూడు ఎకరాలు అదనంగా తవ్వినట్లు విచారణ సందర్భంగా ప్రభుత్వం అంగీకరించింది.. అయితే, మూడు ఎకరాలు కాదని, 20 ఎకరాలు అదనంగా తవ్వారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రుషికొండపై సర్వే చేయించాలని ఆదేశాలు జారీ చేసింది..